త్యాగధనుడు అల్లూరిని స్మరించుకోవాలి

30 Nov, 2016 00:02 IST|Sakshi
  •  ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి
  • అడ్డతీగలలో అల్లూరి విగ్రహావిష్కరణ
  • అడ్డతీగల :
    దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే వంతలSరాజేశ్వరి అన్నారు. అల్లూరి దాడి చేసిన వాస్తవ పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదుట మంగళవారం అల్లూరి సీతారామరాజు యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహాన్ని రంపచోడవరం ఏఎస్పీ అద్నామ్‌ నయూం అస్మీ, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవిష్కరించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి తరంతో పాటు భావితరాలకు కూడా గిరిజనుల హక్కులు, బాధ్యతలను గుర్తుచేస్తూ అల్లూరి నెరపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించేలా కృషిచేయాలన్నారు. అల్లూరి స్మారక స్థలాలను పరిరక్షించడానికి యువజన సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఏఎస్పీ అన్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, చైతన్యాన్ని నింపుకొని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అల్లూరి దాడి చేసిన పోలీస్‌స్టేçÙన్ల వద్దనే కాకుండా పాఠశాలలు, ఇతరత్రా గ్రామాల్లోనూ అల్లూరి విగ్రహాలను నెలకొల్పనున్నట్టు యువజనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తెలిపారు. అల్లూరి జీవిత చరిత్రపై నిర్వహించిన బుర్రకథ పలువురిని ఆకట్టుకుంది. ఎంపీపీ అన్నం సత్తిబాబు, అడ్డతీగల సర్పంచ్‌ పప్పుల చిట్టమ్మ అడ్డతీగల, రాజవొమ్మంగి సీఐలు ముక్తేశ్వర్రావు, మోహ¯ŒSరెడ్డి, అడ్డతీగల ఎస్‌ఐ వై.గణేష్‌కుమార్, అల్లూరిసీతారామరాజు యువజన సంఘం బాధ్యులు దంగేటి సత్తిబాబు, రామన శ్రీను తదితరులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
     
>
మరిన్ని వార్తలు