అమ్మపాలు అమృతంతో సమానం

3 Aug, 2016 17:51 IST|Sakshi
అమ్మపాలు అమృతంతో సమానం

దుబ్బాక: అమ్మ పాలు అమృతంతో సమానమని, బిడ్డలకు అమ్మ పాలే శ్రేష్ఠమని ఎంపీపీ ర్యాకం పద్మ అన్నారు. బుధవారం మండలంలోని చిట్టాపూర్‌, పోతారం, హబ్షీపూర్‌, తిమ్మాపూర్‌, బల్వంతాపూర్‌, అప్పనపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లి పాల విశిష్టతపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లి పాలను పారబోయకుండా బిడ్డకు పట్టించాలని సూచించారు. తల్లి పాలల్లో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుందని, మూఢ నమ్మకాలతో ముర్రుపాలను వృథా చేస్తున్నారన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింత మరణాలు తగ్గించడానికి అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పోతనక రాజయ్య, ఇప్పలపల్లి నాగమణి, అబ్బుల లావణ్య, కొంగరి కనకవ్వ, చెర్లపల్లి బాలమణి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు హేమలత, యాస్మిన్‌ భాషా బేగం, అంగన్‌వాడీలు కవిత, జ్యోతి, జయ, మంజుల, బాల్‌లక్ష్మి, మంజుల, తార, పుష్పలత, శైలజ, రాజమణి, కవిత ఏఎన్‌ఎంలు మంజులు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు