అమరావతి జపం తప్ప ప్రజా సమస్యలు పట్టవా ?

22 Jul, 2016 00:25 IST|Sakshi
► వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు 
► ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం 
 
ఉరవకొండ:
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టడం లేదని, ఎప్పడు చూసినా, ఎక్కడ చూసినా ఆÄయనకు అమరావతి జపం తప్ప వేరే ధ్యాసే లేదని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.  గురువారం స్థానిక ఇంద్రానగర్‌లో గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని అమరావతి పేరుతో వందల కోట్లు దోపిడీ చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, రాజధాని నిర్మాణం పేరుతో పచ్చని పంటలు పండే పొలాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కొని వారి నోట్లో మట్టికొట్టారని అన్నారు.
 
ఇప్పటి వరకు ప్రచార ఆర్భాటం కోసం గోదావరి, కృష్ణా పుష్కరాలను కోట్లు దండుకోవడానికి నిర్వహించడం తప్ప ఒక్క సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదన్నారు. ప్రజా సంక్షేమం వదిలి వ్యాపారం మొదలు పెట్టాడని, అబద్ధాలు, మభ్యపెట్టే మాటలతో కాలం వెల్లదీస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. గడప గడపకూ వైఎస్సార్‌ సీపీ కార్యక్రమంలో ప్రజలు చంద్రబాబు పాలనపై దుమ్మెత్తి పోస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో ఆయనకు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు. 
 
కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, రాష్ట్ర కార్యదర్శులు అశోక్, బసవరాజు, జెడ్‌పీటీసీలు లలితమ్మ, తిప్పయ్య, ఉప సర్పంచ్‌ జిలకర మోహన్, వార్డు సభ్యులు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా