ఆనంద ఆక్వా వద్ద స్వల్ప ఉద్రిక్తత

1 Apr, 2017 23:49 IST|Sakshi
ఆనంద ఆక్వా వద్ద స్వల్ప ఉద్రిక్తత
 మొగల్తూరు: మొగల్తూరులోని ఆనంద ఆక్వా పరిశ్రమలో పనులు చేపట్టారంటూ గ్రామస్తులు పరిశ్రమ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ పరిసరాలు శుభ్రం చేయించుకునేందుకు కూలీలను నియమించుకున్నారు. అయితే  పరిశ్రమ సూపర్‌వైజర్లు విధుల్లో చేరారనుకుని సీపీఎం నాయకులు యడ్ల చిట్టిబాబుతో కలిసి కొందరు స్థానికులు ఇక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో డీఎస్పీ పూర్ణచంద్రరావు రావడంతో వీరిని వారించారు. తాము పరిసరాలను శుభ్రం చేయించుకుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో కంపెనీ వద్ద పరిసరాలు శుభ్రం చేయడానికి వీలులేదని గ్రామస్తులు అనడంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ పరిశ్రమను సీజ్‌ చేయడంతో ఎవరికీ లోపలకు వెళ్లే అవకాశం లేదని, దీంతో ఆరుబయట విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పరిసరాలు శుభ్రం చేయించుకుంటున్నట్టు డీఎస్పీ చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు.  
 
మరిన్ని వార్తలు