జాతీయస్థాయికి "అనంత" నృత్యం

27 Jul, 2016 23:03 IST|Sakshi
జాతీయస్థాయికి "అనంత" నృత్యం

అనంతపురం కల్చరల్‌ : జాతీయస్థాయి నృత్య పోటీల్లో  అనంత కళాకారిణులు మెరిశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నగరంలో దరోహర్‌–2016 పేరిట యూనివర్సల్‌ సాంస్కృతిక్, సో«ద్‌నాట్య నృత్య అకాడమీ వారు నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో అనంతపురానికి చెందిన నృత్యకళా నిలయం సంధ్యామూర్తి శిష్యబృందం ప్రత్యూష కూచిపూడిలో ప్రథమ స్థానంలో, దివ్యశ్రీ రెండవ స్థానంలో నిలిచారు.

డ్యూయెట్‌ విభాగంలో మహాలక్ష్మి, ప్రత్యూషలు మొదటి స్థానాన్ని, కూచిపూడి జూనియర్‌ విభాగంలో మిహిర మూడవస్థానాన్ని, ప్రణవి కన్సొలేషన్‌ స్థానంలో నిలిచారు. నిర్వాహకులు డా.రాఖీ రాజ్‌పుట్, అనూజ్‌ రాజ్‌పుట్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలందుకున్నారు. సంధ్యామూర్తిని ‘ ది బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ ఆఫ్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌’ పురస్కారంతో సత్కరించారు. బుధవారం సాయంత్రం అనంతపురంలోని కమలానగర్‌లో గల నృత్యకళానిలయంలో జరిగిన అభినందన సమావేశంలో సంధ్యామూర్తి జాతీయస్థాయి పోటీల విశేషాలు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు