జయ్యారంలో ఆదిమానవుల ఆనవాళ్లు

15 Aug, 2016 00:30 IST|Sakshi
జయ్యారంలో ఆదిమానవుల ఆనవాళ్లు
మరిపెడ : మండలంలోని జయ్యారంలో ఆదిమానవులు జీవించినట్లుగా భావిస్తున్నా రు. ఈ మేరకు సమాధులు బయటపడినట్లు చెబుతుండ గా.. ఆచార్య నాగార్జున యూ నివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఇస్లావత్‌ సుధాకర్‌ ఆదివారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ తన పరిశోధనలో భా గంగా గతంలోనూ పలుచోట్ల ఆదిమ మానవుల సమా«ధులను గుర్తించానన్నారు. ప్రస్తుతం జయ్యారంలో గుర్తించినవి కూడా మూడు వేల ఏళ్ల క్రితం నాటివన్నారు. అప్పట్లో ఓ వ్యక్తి మృతి చెందితే గొయ్యి తవ్వి మృతదేహాన్ని నాలుగు రాళ్ల మధ్య ఉంచి చుట్టూ బండలు ఏర్పాటు చేసేవారని, మృతుల ఆయుధాలు, పరికరాలు సమాధిలో పూడ్చేవారన్నారు. వీటిని ఇనుపయుగం సమాధులుగా పిలుస్తారన్నారు.  ఇలాంటి సమాధులు జయ్యారం శివారులో వంద వరకు ఉండగా.. పలువురు రైతులు వ్యవసాయం చేయడంతో యాభై వరకు మిగిలాయి. 
మరిన్ని వార్తలు