వేగంగా అందరికీ ఇళ్ళ పథకం

13 Jul, 2017 00:13 IST|Sakshi
సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ ఆదేశం
కాకినాడ సిటీ : ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఎ¯ŒSటీఆర్‌ నగర్‌ పథకం కింద అందరికీ ఇళ్ళు నిర్మించే కార్యక్రమం త్వరితగతిన జరగాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అందరికీ ఇళ్ళు పథకం అమలును జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, ఏపీటెడ్‌కో అధికారులతో సమీక్షించారు. ఈ పథకం కింద జిల్లాలోని మున్సిపాలిటీలలో 19,242 మంది లబ్ధిదారులకు జిప్లస్‌ 3 గృహాలు నిర్మిస్తామన్నారు. ఆయా కేటగిరీల ఆధారంగా లబ్ధిదారుల వాటా సొమ్మును జూలై 20లోగా సేకరించాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో లబ్ధిదారుల వాటా చెల్లించిన వెంటనే బ్యాంక్‌ లింకేజీ కోసం చర్యలు తీసుకొంటాయన్నారు. ఏపీటెడ్‌కో ఎస్‌ఈ బి.శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంక్‌ ఏజీఎం ఎం.ఏ అబ్దుల్‌ రెహమాన్, ఎస్‌బీఐ జిల్లా కో–ఆరి్డనేటర్‌ వి.హనుమంతరావు, కాకినాడ అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వై.శ్రీనివాసరావు, ఏపీటెడ్‌కో ఈఈ రీటా, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 
‘ఉపాధి’ పనులను అప్‌లోడ్‌ చేయండి
ఉపాధి హామీ పథకం సమన్వయంతో వివిధ శాఖల ద్వారా నిర్వహించిన పనులన్నిటి సమాచారాన్ని గురువారం మధ్యాహ్నం ఆ¯ŒSలై¯ŒSలో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కోర్టుహాలులో ఉపాధిహామీ పథకం సమన్వయంతో పనులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ, ఫిషరీస్, సెరికల్చర్, పశుసంవర్థక శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ, అంగ¯ŒSవాడీ భవనాలు, శ్మశానాల పనులను, డీఆర్‌డీఏ ద్వారా చేపట్టిన రోడ్ల వెంట చెట్ల నాటడం, ఐటీడీఏ ద్వారా ఉద్యానవనాల విస్తరణ పనులను ఆయన సమీక్షించారు. ఆగస్టు 15నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జాయింట్‌ కలెక్టర్‌–2, జె.రాధాకృష్ణమూర్తి, డ్వాక్రా పీడీ జి.రాజకుమారి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు