ముద్రగడ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు

8 Feb, 2016 11:51 IST|Sakshi
ముద్రగడ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు

కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభంతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధులను పంపింది. సోమవారం టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరుకున్నారు.

ముద్రగడ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇస్తే ముద్రగడ దీక్ష విరమించే అవకాశముంది. అలాగే తుని కాపుగర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరనున్నారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ ఈ రోజు దీక్ష విరమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు