పిల్లలతో కలిసి ఏఎన్‌ఎమ్‌ల సమ్మె

24 Jul, 2016 19:26 IST|Sakshi
పిల్లలతో కలిసి సమ్మెలో పాల్గొన్న ఏఎన్‌ఎంలు

జహీరాబాద్‌ టౌన్‌: తమ డిమాండ్ల సాధన కోసం ఏఎన్‌ఎంలు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. పిల్లలతో కలసి ఆందోళనకారులు సమ్మెలో కూర్చున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.21,300 వేతనం చెల్లించాలని, ఉద్యోగాలు పర్మినెంట్‌ చేసి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమ్మెలో యూనియన్‌ నాయకురాలు కృష్ణవేణి, రోజారాణి, శ్యామల, అరుణ, సుధారాణి, సుజాత, సరళ తదితరులున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా