‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదానం

20 Apr, 2016 16:04 IST|Sakshi
‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదానం

జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట లోని శ్రీజోగినాథ ఆలయ రథోత్సవాల్లో భాగంగా బుధవారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ మేనేజర్ పీఎస్.కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు.

సుమారు మూడువేల మంది భక్తులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్‌కు ఆలయ రథోత్సవ కమిటీ అభినందనలు తెలిపింది. సంస్థ టెక్నికల్ మేనేజర్ నరేష్ కుమార్, ఇంజనీర్ గణేష్, జోగిపేట షిర్టీ సాయిబాబా ట్రేడర్స్ యాజమాని సీహెచ్.నర్సింలు, సంగారెడ్డికి చెందిన శ్రీ బాలాజీ సాయిరాం ట్రేడర్స్ యాజమాని కృష్ణకాంత్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎస్.కవిత సురేందర్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు