శ్రీవారి అన్నదానానికి కూరగాయల వితరణ

11 Aug, 2016 19:51 IST|Sakshi
శ్రీవారి అన్నదానానికి కూరగాయల వితరణ
లబ్బీపేట :
స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నామని, వాటికి అవసరమైన కూరగాయలను దాతలు ఉచితంగా అందించడం శుభసూచికమని రాష్ట్ర సమాచార ఫౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునా«థరెడ్డి అన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో అరవపల్లి శేషసాయివర్మ, కావ్య, అరవపల్లి ఆధిత్య, మండవ సస్య, మండవ కాళీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో రూ. 3లక్షల విలువైన కూరగాయలను గురువారం సరఫరా చేశాారు. ఈ లారీని బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో తీతీదే∙ఆలయ నమూనా ఏర్పాటు చేసామని, ఆ ఆలయంలో ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. అన్నదానానికి దాతలు కూరగాయలు ఉచితంగా అందచేయడం అభినందనీయమని, దీనిని మిగిలిన వారు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. 
అధికారులకు కూరగాయలు అందచేతః
దాతలు అందించిన కూరగాయలను తితిదే కల్యాణ మండపంలోని అన్నప్రసాదం ట్రస్ట్‌ ప్రత్యేక అధికారిణి పి.చెంచులక్ష్మికి మండవ కుటుంబరావు అందించారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి మాట్లాడుతూ స్వామివారి ప్రసాదంలో భాగంగా టమాటా రైస్, పులిహోర అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ క్యాటరింగ్‌ ఆఫీసర్‌ జీఎల్‌ఎన్‌ శాస్త్రి పాల్గొన్నారు. 
 
ఫొటో 11 విఐఇ 41–  తితిదే అన్నదానానికి కూరగాయల లారీని జెండా ఊపి ప్రారంభిస్తున్న పల్లె రఘునాథరెడ్డి , మండవ కుటుంబరావు తదితరులు 
 
>
మరిన్ని వార్తలు