అన్నవరానికి భక్తుల తాకిడి

17 Oct, 2016 21:59 IST|Sakshi
  • విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణంలో
  • సత్యదేవుని దర్శనం
  • పెరిగిన వ్యాపారం
  • అన్నవరం : 
    సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సాధారణంగా ఆశ్వయుజమాసంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ¿¶ క్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని దర్శించి పూజలు చేస్తున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారం రోజుల్లో సుమారు 1.50 లక్షల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకోగా, 12వేల వ్రతాలు జరిగాయి. ఒక్క ఆదివారమే సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2,203 వ్రతాలు జరిగాయి. భక్తుల రాకతో కొండ దిగువన వ్యాపారాలు పెరిగాయి. దేవస్థానానికి సుమారు రూ.రెండు కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొండ దిగువన సత్యదేవుని తొలిపాంచా వద్ద పూజాద్రవ్యాలు, స్వామివారి ప్రసాదాలు, ఫ్యాన్సీ సామాన్లకు గిరాకీ పెరిగింది.
     
    కార్తీకమాస ఏర్పాట్లపై నేడు సమావేశం
     అన్నవరం :  ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్న కార్తీకమాస ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు రత్నగిరిపై దేవస్థానం–ప్రభుత్వ అధికారుల సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఇతర శాఖల సిబ్బంది హాజరుకానున్నారు. ఈనెల 25న చేపట్టనున్న సత్యదీక్షలు, నవంబర్‌ 11న జరగనున్న సత్యదేవుని తెప్సోత్సవం, 14న జరిగే గిరి ప్రదక్షిణ, 27న స్వామివారి అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు.
     
మరిన్ని వార్తలు