ఆదాయ వివరాలు వెల్లడించండి

28 Jul, 2016 00:03 IST|Sakshi
కొవ్వూరు : ఆదాయ వెల్లడి పథకం–2016 సెప్టెంబర్‌ 30 వరకు అమలులో ఉంటుందని, ఈలోగా వ్యాపార, వాణిజ్య రంగాల్లోని వారు తమ ఆదాయ వివరాలను వెల్లడించాలని  సూచించారు. బుధవారం స్థానిక యువరాజ్‌ ఫంక్షన్‌ హాలులో ఆదాయపన్ను శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు, వివిధ ఉన్నత వర్గాల వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలను ఆయన నివత్తి చేశారు. ఆదాయ వెల్లడి ప«థకం విధి విధానాలను వివరించారు. ఆదాయ వివరాలను వెల్లడించి నలభై ఐదుశాతం పన్ను చెల్లిస్తే క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తామని, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు తప్ప  ప్రతిఒక్కరూ ఆదాయ వివరాలు వెల్లడించవచ్చని సూచిచారు. జిల్లాలో ఇప్పటికి వరకు ఎనిమిది సమావేశాలు నిర్వహించామన్నారు.
ఏలూరు రేంజ్‌ పరిధిలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు డివిజన్లలో  సుమారు 40వేల మంది ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉన్నారని తెలిపారు. గత ఏడాదిగా జిల్లాలోని ఎనిమిది వ్యాపార సంస్థలపై దాడులు చేసి రూ.15కోట్లు లెక్కల్లో లేని ఆదాయం గుర్తించి రూ.4కోట్లు మేర పన్ను వసూలు చేసినట్లు వివరించారు. తణుకు ఆదాయపన్ను అధికారి బి.ఎ.ప్రసాద్‌ మాట్లాడుతూ నల్లధనం కలిగి ఉండడం మంచిది కాదన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పరిమి రాధాకష్ణ, ఆడిటర్‌ డి.ఆర్‌.ఎన్‌.శాస్త్రి, రైస్‌ మిల్లర్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు మట్టే ప్రసాద్, మునిసిపల్‌ చైర్మన్‌ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌(చిన్ని), వైస్‌ చైర్మన్‌ దుద్దుపూడి రాజారమేష్, యువరాజ్‌ కేబుల్‌ అధినేత దుద్దుపూడి రామచంద్రరావు(రాము), మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులతోపాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు