అనూర్‌ అభివృద్ధికి రూ. 45.28 కోట్లు

23 Oct, 2016 20:12 IST|Sakshi
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : 
ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అనూర్‌) అభివృద్ధికి రూ. 45 కోట్ల 28 లక్షలు ప్రభుత్వం కేటాయించినట్టు ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ నిధుల నుంచి సై¯Œ్స కళాశాల భవనానికి రూ. 10.74 కోట్లు, ఆరŠట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల భవనానికి రూ. 10 కోట్లు, ఉమె¯Œ్స హాస్టల్‌ భవనానికి రూ. 6.46 కోట్లు, సై¯Œ్స విద్యార్థుల హాస్టల్‌ భవనానికి రూ. ఐదు కోట్లు, రోడ్లకు రూ. 7.50 కోట్లు, ప్రహరీ, గేటు ఏర్పాటుకు రూ. 3.58 కోట్లు, మంచినీటి పథకాలకు రూ. ఒక కోటి, ఇంటర్నెట్, కంప్యూటర్, వైఫై సౌకర్యాల కల్పనకు రూ. ఒక కోటి కేటాయించారన్నారు. దీంతో యూనివర్సిటీ మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు