అమరావతిపై ఎన్జీటీలో మరో పిటిషన్

23 Dec, 2015 12:13 IST|Sakshi

న్యూఢిల్లీ: అమరావతి పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో మరోసారి పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతుల్లో నిబంధనలు పాటించలేదని శర్మ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. సున్నిత పర్యావరణ ప్రాంతంలో విమానాలకు అనుమతికి రాష్ట్ర అథారిటీ లేదని గుర్తుచేశారు.

అయితే, పిటిషన్ ఇంత ఆలస్యంగా దాఖలుచేశారేమిటి అని ఎన్జీటీ ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఎన్జీటీ ఏపీ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. తాజాగా మరో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఎన్జీటీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 

>
మరిన్ని వార్తలు