అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా!

3 Mar, 2017 01:20 IST|Sakshi
అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న రాక్షస పాలనను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట గురువారం ధర్నాలు జరిగాయి. ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలబడ్డ వారిపై కేసులు పెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై కేసు పెట్టకుండా ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌పై కేసు నమోదు చేయ డం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను తరలించడం అన్యాయమని, డాక్టర్లు సైతం ఇదే విషయం చెప్పినా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనన్నారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లం గోళ్ల శ్రీలక్ష్మి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, ధర్నాలు జరిగాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ర్యాలీ అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. పెంటపాడులోనూ ధర్నా జరిగింది. ఆకివీడులో ఉండి నియోజకవర్గ కన్వీనర్‌ పాతపాటి సర్రాజు ధర్నాలో పాల్గొన్నారు. కొవ్వూరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పార్టీ కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలవరం నియోజకరవర్గంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు నేతృత్వంలో పలుచోట్ల ధర్నాలు జరిగాయి. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు నేతృత్వంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ కోడే యుగంధర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గోపాలపురం వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు ప్రధాన కూడలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, పెనుమంట్రలో ధర్నా చేశారు. ఉంగుటూరులో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు