బాక్సైట్పై వెనక్కి తగ్గారు

16 Nov, 2015 23:33 IST|Sakshi

విజయవాడ: విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాల జీవోపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ జీవోను తాత్కలికంగా పక్కకు పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి తెలియకుండానే అటవీ శాఖ జీవో జారీ చేసిందని చెప్పారు.

గిరిజనులతో చర్చలు విస్తృతంగా జరిపి అనంతరం ప్రజాభిప్రాయం సేకరిస్తామని ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాగా, స్వపక్షం విపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పోర్టుఅ అభివృద్ధికి ఏపీ మరిటైన్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బావానాపాడు-కళింగపట్నం, విశాఖపట్నం-గంగవరం, కాకినాడ పరిసర ప్రాంతం, మచిలీపట్నం-ఓడరేవు, కృష్ణపట్నం-రామయపట్నం క్లస్టర్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు