ఏపీ లాసెట్-2016 ఫలితాలు విడుదల

10 Jun, 2016 10:29 IST|Sakshi

అనంతపురం : ఏపీ లాసెట్-2016 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.  మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 93.73మంది ఉత్తీర్ణత సాధించారు.

మూడేళ్ల లాసెట్లో బోయపాటి సురేష్ కుమార్ (అనంతపురం)కు మొదటి ర్యాంక్, అయిదేళ్ల లాసెట్ కోర్సులో సాంబ కైలాష్ (గుంటూరు) ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇక పీజీ లాసెట్లో హిమ పాండేకు (విశాఖ) మొదటి ర్యాంక్ వచ్చింది. లాసెట్ ఫలితాలను www.aplawcet.org లో చూడవచ్చు. గత ఏడాది కూడా ఏపీ లాసెట్ను కృష్ణ దేవరాయ యూనివర్శిటీనే నిర్వహించింది.

మరిన్ని వార్తలు