సచివాలయ భవనాల అప్పగింతే..!

10 Feb, 2017 03:14 IST|Sakshi
సచివాలయ భవనాల అప్పగింతే..!

ఏపీ త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయ అంగీకారం
తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థలు, ఉద్యోగుల విభజనపై కీలక నిర్ణయాలు
గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులు రెండో భేటీ
26న రాజ్‌భవన్‌లో మూడో సమావేశం


సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంలో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిరుపయోగంగా ఉన్నందున ఈ భవనాలను ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని, తమ ముఖ్యమంత్రితో మాట్లాడి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో రెండు రాష్ట్రాల కమిటీ సభ్యులు గురువారం రెండోసారి భేటీ అయ్యా రు. తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రా వు, జగదీశ్‌రెడ్డి, సలహాదారు వివేక్, మెంబర్‌ సెక్రెటరీ రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ తరఫు న మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, విప్‌ కాల్వ శ్రీనివాసులు, మెంబర్‌ సెక్రెటరీ ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు. పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు.

9 సంఘాల విభజనకు ఒప్పందం..
ఈ చర్చల సందర్భంగా 9 బీసీ సంఘాల విభజనకు పరస్పర ఒప్పందం కుదిరిం ది. ఏపీ వడ్డెర కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, ఏపీ వాల్మీకి బోయ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, ఏపీ కృష్ణబలిజ /పూసల కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, ఏపీ బట్రాజ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, ఏపీ విశ్వబ్రాహ్మణ కోఆప రేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఏపీ కుమ్మర (శాలివాహన) కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరే షన్‌ లిమిటెడ్, ఏపీ మేదర కోఆపరేటివ్‌ సొసై టీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, ఏపీ గీత కార్మికుల కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, ఏపీ సగర(ఉప్పర) కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ విభజనకు రెండు కమిటీల మధ్యా అంగీకారం కుదిరింది.

హైకోర్టు విభజనపై ప్రతిపాదన..
హైకోర్టు విభజనపై కూడా సత్వర నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. దీనిపై రెండు రాష్ట్రాల కమిటీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. హైకోర్టుకు అమరావతిలో త్వరగా స్థలం కేటాయించుకుని, విభజనకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

ఏపీకే నిర్వహణ వ్యయం పెరిగిపోతోంది : హరీశ్‌రావు
‘ఏపీ సచివాలయం ఇప్పటికే ఖాళీ చేసి తాళాలేసి పెట్టారు. అక్కర లేకున్నా పన్ను లు, బిల్లులు కడుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికే నిర్వహణ వ్యయం పెరిగిపో తోంది. ఎలుకల బాధ. చెత్త పేరుకోవటంతో మాకూ ఇబ్బందిగానే ఉంది.. అదే విషయాన్ని చెప్పాం. సీఎంతో మాట్లాడి నిర్ణయం చెపుతామన్నారు’అని భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో అన్నారు.

పరస్పర బదిలీలకు ఓకే..
సచివాలయంతో పాటు జిల్లాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రతిపాదనకు చర్చల్లో అంగీకారం కుదిరింది. ఏయే పోస్టులకు చెందిన వారు.. ఎంత మంది ఉద్యోగులు పరస్పర బదిలీకి అంగీకార యోగ్యంగా ఉన్నారో అభ్యర్థనల ను స్వీకరించి.. అంత మేరకు బదిలీ చేస్తే ఇబ్బందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైం ది. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, పెండిం గ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల ఎండీలు కలసి మాట్లాడుకుని తెలంగాణ, ఏపీ ఉద్యోగుల వివరాలను వారం రోజుల్లో తమకు అందిం చాలని కమిటీ సభ్యులు సూచించారు. తదుపరి సమావేశంలో ఈ వివరాలను చర్చించాలని నిర్ణయించారు. కాగా, ఈ నెల 26న రాజ్‌భవన్‌లో మూడోసారి సమావేశం కావాలని నిర్ణయం జరిగింది.

మరిన్ని వార్తలు