రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుస్తాం

17 Aug, 2016 21:25 IST|Sakshi
రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారుస్తాం
మంత్రి గంటా శ్రీనివాసరావు
ఇబ్రహీంపట్నం:
 రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్య, విజ్ఞాన సమాజం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నత, ప్రాథమిక, సాంకేతిక శాఖలను మానవ వనరుల శాఖలో విలీనం చేశామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సుమిత దావ్రా మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో ఉత్తీర్ణతా శాతం 45 నుంచి 66 శాతానికి పెరగడం శుభసూచికమన్నారు. సాంకేతిక, కళాశాలల విద్యా కమిషనర్‌ బి.ఉదయలక్ష్మీ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఒవర్‌సిస్‌ విద్యానిధి పథకం కింద రెండేళ్లల్లో రూ.8.65 కోట్లు ఖర్చుపెట్టి 117 మంది పేద విద్యార్థులు చదువుకునేలా చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, ఉన్నత విద్యామండలి అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణా యూనివర్సిటీ ఉప కులపతి రామకృష్ణారావు, ఎన్టీరంగా యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ రాజేంద్రకుమార్, విద్యాశాఖ కమిషనర్‌ ఎ.సంధ్యారాణి  తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు