ఉద్యోగులను పెంచాలని వినతి

8 Oct, 2016 00:15 IST|Sakshi
జేసీ దివ్యకు వినతిపత్రం సమర్పిస్తున్న ఉద్యోగులు

ఖమ్మం సహకారనగర్‌ : జిల్లాల పునర్విభజనలో భాగంగా భూ కొలతలు, ల్యాండ్‌ రికార్డుల శాఖలో సిబ్బందిని పెంచాలని కోరుతూ జేసీ దివ్యకు టీఎన్జీఓస్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఉద్యోగుల సంఘం నేతలు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు అఫ్జల్‌హసన్, జగదీష్‌ మాట్లాడారు. జిల్లాల పునర్విభజన సమయంలో తామంతా పూర్తి మద్దతు నిస్తున్నామని, ప్రస్తుతం తమ శాఖలో ఉన్న సిబ్బందితో ప్రభుత్వ కార్యక్రమాల అమలుతోపాటు భూ హద్దులు, తగాదాలను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలు పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని, త్వరలో తమ శాఖకు సిబ్బందిని పెంచాలని కోరారు. కార్యక్రమంలో శాంతకుమారి, ఉపేందర్, సుధాకర్, సత్యేంద్రకుమార్‌ పాల్గొన్నారు


Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు