అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

17 Jan, 2017 04:42 IST|Sakshi

నల్లగొండ టూటౌన్‌ : పట్టణ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సెప్టిక్‌ ట్యాంకులు లేకుండా ఉన్న మరుగుదొడ్లకు వాటిని నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బందిని ఆదేశించారు.   వివిధ పనుల కోసం కార్యాయానికి వచ్చే ప్రజలను తిప్పుకోకుండా పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో లైట్లు పోయిన ప్రాంతాలను గుర్తించాలని, అలాంటి చోట్ల వెంటనే కొత్త లైట్లు వేయాలన్నారు. ప్రకాశం బజార్‌లో ఒక్క లైట్‌ కూడా వెలగడం లేదని, అవన్ని వెలిగే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఈఈ సత్యనానాయణ, ఏసీపీ ప్రసాధరావు, డిఈలు వెంకటేశ్వర్లు, రాములు, పర్యావరణ ఇంజనీరు కొమ్ము ప్రసాద్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు