ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

8 Oct, 2016 00:14 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భాగంగా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు (వికలాంగులు) అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్‌ మరో 10 బీసీ ఫెడరేషన్ల లబ్ధిదారులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నాటికి ఆన్‌లైన్‌లో సంబంధిత పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల్లో వికలాంగులకు 3 నుంచి 10 శాతం మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అభ్యర్థులు 21 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలని, తెల్లరేషన్‌ కార్డు కలిగి, కనీసం చదవడం, రాయడం తెలిసిన వారై ఉండాలన్నారు. దగ్గరలోని నెట్‌ సెంటర్‌లోగాని, మీ సేవా కేంద్రంలో కానీ ఎపిఒబిఎంఎంఎస్‌.సిజిజి.జిఒవి.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రసాదరావు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు