సిపెట్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

4 Aug, 2016 01:24 IST|Sakshi
అనంతపురం అర్బన్‌ : సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీఈటీ) పర్యవేక్షణలో శిక్షణ అనంతరం ఉపాధి కల్పించే పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ వి.కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ పథకం కింద అర్హులన్నారు. మెషిన్‌ ఆపరేటరు విభాగంలో లేత్, మిల్లింగ్‌ శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు. మెషిన్‌ ఆపరేటర్‌ ఇంజెక్షన్‌ మోల్డింగ్, మెషిన్‌ ఆపరేటర్‌ ప్లాస్టిక్స్‌ ఎక్రిట్రూజేషన్‌లో శిక్షణ కోసం ఎనిమిదో తరగతి ఆపై విద్యార్హతలు లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఇందుకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుందన్నారు. ఆరు నెలల పాటు శి„ý ణ ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, హాస్టల్‌ వసతి  కల్పిస్తారని తెలిపారు.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నగర పరిధిలోని గుల్జార్‌పేటలో ఉన్న మధురిమ బిల్డింగ్‌ మేడపైన 4వ గదిలో దరఖాస్తులు పొందవచ్చని, లేదా ఈ–మెయిల్‌ ఛిజీp్ఛ్టజిyఛీట్టఛిఃజఝ్చజీl.ఛిౌఝ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  వివరాలకు సీనియర్‌ అధికారి గోవిందు 9959333415, 9959333427ను సంప్రదించాలన్నారు.  
మరిన్ని వార్తలు