రేపు ఏపీపీఎస్సీ పరీక్షలు

16 Dec, 2016 22:40 IST|Sakshi
  •  హాజరుకానున్న 2264 మంది అభ్యర్థులు
  • ఏర్పాట్లపై డీఆర్వో మల్లీశ్వరిదేవి సమీక్ష
  • అనంతపురం సెంట్రల్‌ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అసిస్టెంట్స్‌ ఇంజనీర్స్‌ పోస్టులకు ఆదివారం (18న) నిర్వహిస్తున్న పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మల్లీశ్వరిదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీకాన్ఫరెన్స్‌ హాల్లో పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

    ఏపీపీఎస్‌సీ పరీక్షలకు మొత్తం 2,264 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు డీఆర్వో తెలిపారు. నగరంలో ఐదు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా పత్రాల బాక్సులు రవాణా కోసం ఇద్దరు తహశీల్దార్లను లైజనింగ్‌ అధికారులుగా, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 5 మంది తహశీల్దార్లను సహాయక సమన్వకర్తలుగా, ప్లెయింగ్‌స్క్వాడ్‌లుగా నియమించామని చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్లను పరీక్షా కేంద్రాల్లో తీసుకురాకూడదని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మాత్రమే కేంద్రాల్లో అనుమతిస్తారని, పరీక్షా సమయం ముగిసే వరకూ బయటకు అనుమతి లేదన్నారు. హాల్‌టికెట్లు పొరపాట్లు ఉంటే గెజిటెడ్‌ అధికారిచే సంతకం చేయించి ఇన్విజలేటర్‌కు అందజేయాలని, లేనిచో అలాంటి అభ్యర్థిని పరీక్షకు అనుమతించబోమన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

     

మరిన్ని వార్తలు