సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు పూర్తి

2 Jan, 2017 09:52 IST|Sakshi
సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి: తిరుపతిలో 104వ భారత సైన్స్ కాంగ్రెస్(ఐఎస్‌సీ) సమ్మేళనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరుగనున్న సైన్స్ కాంగ్రెస్‌ కోసం శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ ఆవరణంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

విశ్వవిద్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రధానమంత్రికి స్వాగతం పలికే ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువచేసే దిశగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించనున్నారు. తొమ్మిది మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నిష్టాతులైన 200 మంది శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగశాలల శాస్త్రవేత్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఇఆర్‌ఎస్ తదితర సంస్థలకు చెందిన 18వేల మంది ప్రతినిధులు సైన్స్ కాంగ్రెస్‌కు హాజరుకానున్నారు.

>
మరిన్ని వార్తలు