వరసిద్ధుడి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం

23 Aug, 2016 22:52 IST|Sakshi
స్వామి వారి ప్రతిమలకు రంగులు దిద్దుతున్న కళాకారులు
కాణిపాకం(ఐరాల):
కాణిపాకంలో వెలసిన  వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి 21 రోజుల పాటూ జరిగే స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఏర్పాట్లను ఈఓ పూర్ణచంద్రారావు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు, ఆలయ పరిసరాల్లో భారీ కటౌట్లు, విద్యుత్‌ దీపాలంకరణలు, విద్యుత్‌ కటౌట్లు, ఆర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్వామి వారి ప్రతిమలు, స్వాగత బోర్డులు, అలాగే దేవస్థాన పరిధిలోని నిత్యాన్నదాన కేంద్రాలు, వసతి గృహ సముదాయాలు, కల్యాణ కట్ట భవనాల వద్ద వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మరగదాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, సుపథ మండపం, ఆన్వేటి మండపం, రాజ గోపురం, మూషిక మండపాలకు రంగులు వేస్తున్నారు. 
 
 
 
>
మరిన్ని వార్తలు