చోరీలకు పాల్పడుతున్న ఏడుగురి అరెస్ట్‌

25 Jan, 2017 23:30 IST|Sakshi
చోరీలకు పాల్పడుతున్న ఏడుగురి అరెస్ట్‌
 
 
  • రూ.3.84 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు నగలు స్వాధీనం
రాజమహేంద్రవరం క్రైం :
వ్యసనాలకు బానిసలైన యువకులు మహిళల మెడలో బంగారు నగలు చోరీ చేస్తూ పట్టుబడ్డారు. బుధవారం రాజమహేంద్రవరం త్రీటౌ¯ŒS పోలీస్‌ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.శ్రీరామకోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఏడుగురు యువకులు ముఠాగా ఏర్పడి మహిళల మేడలో నగలు చోరీలు చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తు విలాసంగా గడుపుతున్నారన్నారు. మంగళవారం సాయంత్రం 4.30 సమయంలో కోరుకొండ రోడ్డులోని ముత్తుట్‌ ఫైనా¯Œ్స కంపెనీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుల సమాచారం రావడంతో త్రీటౌ¯ŒS ఎస్సై ఎం.వెంకటేశ్వరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ డీవీ భాస్కరరావు, కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లి యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పిఠాపురానికి చెందిన అనుపోజు శంకర్‌ శాంతి స్వరూప్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పీ అండ్‌ టీ కాలనీకి చెందిన కాకర్ల శ్రీనివాసరెడ్డి, మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి మహిళల మెడల నుంచి బంగారు పుస్తెలతాళ్లు, మంగళ సూత్రాలు చోరీలు చేసి పరారవుతున్నారని తెలిపారు. నిందితుల నుంచి 6 బంగారు మంగళ సూత్రాల తాడులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి బరువు 128 గ్రాములు ఉంటుందని తెలిపారు. విలువ రూ 3.84 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం తరలించారు.
 
మరిన్ని వార్తలు