పింఛన్‌ కోసం వెళ్తే అరెస్టు చేయిస్తానని బెదిరించారు..

14 Mar, 2017 03:07 IST|Sakshi
పింఛన్‌ కోసం వెళ్తే అరెస్టు చేయిస్తానని బెదిరించారు..

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు

కోటగిరి(బాన్సువాడ) :
గతేడాది జనవరి వరకు తనకు పింఛన్‌ వచ్చిం దని, ఆ తర్వాత రావ డం లేదని రుద్రూర్‌ మండలం రాణంపల్లికి చెందిన గంగాగౌడ్‌ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పలుమార్లు కార్యాలయ సూపరింటెండెంట్‌ బాలగంగాధర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఎంపీడీ వో అతారొద్దీన్‌కు సమస్యను వివరించాడు. దీంతో ఎంపీడీవో పింఛన్‌ ఎందుకు నిలిపివేశారు

సూపరింటెండెంట్‌ వద్దకు వెళ్లి అడగమని సూచించడంతో గంగాగౌడ్‌ సూపరింటెండెంట్‌ వద్దకు వెళ్లి పింఛన్‌ ఎందుకు రావడం లేదని అడగగా.. సదరు అధికారి గంగాగౌడ్‌పై దుర్భాషలాడుతూ మళ్లీ పింఛన్‌ వస్తలేదని అడిగితే అరెస్టు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగాడని గంగాగౌడ్‌ మండల కార్యాయలంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గ్రామంలో చాలామంది అనర్హులకు పింఛన్‌లు ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌ విఠల్‌కు విన్నవించాడు. ఈ విషయమై ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్‌ సమాధానమిచ్చారు.
 

మరిన్ని వార్తలు