'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

28 Feb, 2016 08:49 IST|Sakshi
'భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను'

మహేష్‌బాబుతో చిత్ర నిర్మాణం
ఆ సంస్థ అధినేత అశ్వనీదత్
 
కొత్తపేట : తెలుగులో ప్రముఖ దర్శకులు, హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ కొన్నేళ్ల విరామం తరువాత తిరిగి చిత్ర నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ తెలిపారు. ఆయన శనివారం సతీసమేతంగా మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామివార్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాలం కలిసి రాక చిత్ర నిర్మాణంలో విరామం ఏర్పడిందని, ఈ ఏడాది నుంచి వరుసగా చిత్రనిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
 
 గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా త్వరలో చిత్ర నిర్మాణం ప్రారంభించి వచ్చే ఏడాది మేలో విడుదలకు ప్లాన్ చేశామని, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే రామ్‌చరణ్ హీరోగా చిత్రనిర్మాణం ప్రారంభిస్తామని, ఆ చిత్రానికి దర్శకుడిని నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తన అభిమాన హీరోలు సీనియర్ ఎన్‌టీఆర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు.
 
చిరంజీవితో తీసిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ ఎక్కువ పేరు తెచ్చిందన్నారు. చిరంజీవి 151 లేదా 152 చిత్రాన్ని తానే నిర్మిస్తానన్నారు. తన కుమార్తె ప్రియాంకదత్ స్వప్నా బ్యానర్ స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని నిర్మించిందని, ఆ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథతో చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. మహానటుడు ఎన్‌టీఆర్ స్ఫూర్తితో టీడీపీలోకి వచ్చిన తాను అదే పార్టీలో కొనసాగుతున్నానన్నారు. ఒక్కసారి టీడీపీ తరఫున ఎన్నిక ల్లో పోటీ చేసినా ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం