అసిస్టెంట్‌ ఇంజనీర్లకు పదోన్నతులు ఇవ్వాలి

19 Sep, 2016 01:03 IST|Sakshi
మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు చంద్రారెడ్డి


పీఆర్‌ డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రారెడ్డి
ఖమ్మం జెడ్పీసెంటర్‌ : పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్‌ డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర  అధ్యక్షుడు ఎన్‌.చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా చంద్రారెడ్డి మాట్లాడారు. ఇంజనీర్ల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కలిశామని, ఇంజనీర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. టైమ్‌ స్కేల్‌పై పనిచేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల సర్వీస్‌ క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. పీఆర్, గ్రామీణ నీటి సరఫరా శాఖలో పనిచేస్తున్న సైట్‌ ఇంజనీర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజనీర్లకు ప్రయాణభత్యం నెలకు రూ.5 వేలు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి, నాయకులు వీరయ్య, కృష్ణ చైతన్య, పేరయ్య, వెంకటరామిరెడ్డి, ప్రసాద్, కె.శ్రీనివాస్, ఎల్లయ్య, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రిటైర్డ్‌ ఎస్‌ఈ రామకోటారెడ్డిని ఘనంగా సన్మానించారు.

 

మరిన్ని వార్తలు