ఆత్మీయ స్వాగతం

14 May, 2017 00:29 IST|Sakshi
ఆత్మీయ స్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి జిల్లా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం భీమవరం చేరుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తనయుడు సాగర్‌–సుధ దంపతులను ఆశీర్వదించారు. 
అనంతరం ఏలూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఘంటా 
మురళీరామకృష్ణ కుమార్తె డాక్టర్‌ పావని, డాక్టర్‌ నిషాంత్‌ వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు అత్మీయ స్వాగతం పలికారు. ఆయన భీమవరం, ఏలూరులో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అభిమాన నేతకు నీరాజనం పలికారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌కు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలు విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి పెనుగొండ మండలం సిద్ధాతం వద్ద జిల్లాలో అడుగుపెట్టారు. ఆయన పర్యటన ఏ రూట్‌లో ఉంటుందో ప్రకటించకపోయినా.. అప్పటికప్పుడు ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు సెంటర్లలోకి చేరుకుని స్వాగతం పలికారు. సిద్ధాతం, ఉండ్రాజవరం జంక్షన్, తణుకు, దువ్వలో అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. తాడేపల్లిగూడెం మీదుగా భీమవరం చేరుకున్న వైఎస్‌ జగన్‌ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. ఈనెల 9న భీమవరంలో గ్రంధి ఇంట జరిగిన వివాహ వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వైఎస్‌ జగన్‌ శనివారం మధ్యాహ్నం వెళ్లి నూతన దంపతులు సాగర్, 
సుధలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి ఏలూరు బయలుదేరి వచ్చారు.  మండుటెండలోనూ  ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ఆకివీడులో హారతులు పట్టారు. అక్కడ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన వైఎస్‌ జగన్‌ ఏలూరు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ నగర, మండల శాఖ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మంచెం మైబాబు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాని ఇంటికి తరలివచ్చారు. అనంతరం వట్లూరులోని శ్రీ కన్వెన్షన్‌  హాల్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ కుమార్తె డాక్టర్‌ పావని, డాక్టర్‌ నిషాంత్‌ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, శ్రీకాకుళం జిల్లా పార్టీ ఇన్‌ చార్జి కొయ్యే మోషేన్‌ రాజు, నియోజకవర్గాల  కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, తానేటి వనిత, దయాల నవీన్‌ బాబు, గుణ్ణం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తోట గోపి, చీర్ల రాధయ్య, మామిళ్లపల్లి జయప్రకాష్, వందనపు సాయిబాలపద్మ, పేరిచర్ల విజయనర్సింహరాజు, డాక్టర్‌ వేగిరాజు రామకృష్ణంరాజు, బొద్దాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 
 
>
మరిన్ని వార్తలు