టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు

17 Jul, 2016 23:31 IST|Sakshi
అనంతపురం సెంట్రల్‌ : అనంతపురంలో టీడీపీ నాయకుడు, కార్పొరేటర్‌ భర్త జయరాంనాయుడుపై ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ తెలిపారు. నాయుడు ఇంటి ముందు చేపట్టిన మురుగు కాలువ పనుల్లో భాగంగా అడ్డు గా ఉన్న వేపచెట్టును కూలీలు తాతయ్య, మరో ఇద్దరు తొలగిం చారు. దీంతో వారిపై నాయుడు దాడి చేయడమే గాక కులం పేరు తో తమను దూషించి అవమానించినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు