గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులా?

26 Jul, 2016 00:30 IST|Sakshi
మహారాణిపేట: గో సంరక్షణపేరిట దళితులపై కొంతమంది హిందువులు చేస్తున్న దాడులను దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కొందరు మతోన్మాదులు దళితులపై దాడి చేయడమే కాకుండా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. గోమాంసం తిన్నారనే నెపంతో ముస్లిం, మైనార్టీలను దారుణంగా హతమార్చినందుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట దళితసేన ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా పాల్తేటి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ఇటు పాలకులను అటు హిందూమత పెద్దలను ప్రశ్నించారు. దాళితులపై దాడులకు దిగిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి, రాష్ట్ర కార్యదర్శి చింతాడ సూర్యం పలువురు దళితసేన నేతలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందచేశారు.  
>
మరిన్ని వార్తలు