మొక్కల కోసం వెళుతున్న ఆటో బోల్తా

10 Jul, 2016 01:52 IST|Sakshi
మొక్కల కోసం వెళుతున్న ఆటో బోల్తా

ఇద్దరి మృతి  
అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం

 శివ్వంపేట:  హరితహారంలో నాటేందుకు మొ క్కలు తీసుకురావడానికి వెళుతున్న ఆటో ట్రాలీ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారి శివ్వంపేట గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కింద  మొక్కలు నాటేందుకు మొ క్కలు అవసరమయ్యాయి. దీంతో నర్సాపూర్‌లోని నర్సరీ నుంచి మొక్కలు తీసుకువెళ్లేందుకు చిన్నశంకరంపేట నుంచి ముగ్గురు కూలీలతో అశోక్‌లేలాండ్ ఆటోట్రాలీ బయలుదేరింది.

శివ్వంపేట గ్రా మం దాటగానే ఆటో అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త కారణంగా అదుపు తప్పి రోడ్డు కుడివైపునకు వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో కూర్చున్న కూలీలు చిన్నశంకరంపేట మండలం వె ంకటరావుపల్లెకు చెందిన కాసాల నర్సిం లు(40) ఇదే మండలం గజగట్లపల్లికి చెందిన బర్మద అంసమ్మ(43)లు తీవ్రం గా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరూ చికిత్స పొందుతూ మృ తిచెందారు. ఆటోలో ముందు కూర్చున్న మరో కూలి పండరి సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో బోల్తాపడగానే డ్రైవర్ పరారయ్యాడు. శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటోలో బయలుదేరిన కూలీలు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు