ఆటో డ్రైవర్‌ దుర్మరణం

26 Mar, 2017 23:30 IST|Sakshi
ఆలూరు రూరల్‌ : ఆలూరు గ్రామశివారులోని మొలగవళ్లి మలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. ఆలూరు నుంచి ఆటో డ్రైవర్‌ కొండప్ప మొలగవళ్లి గ్రామంలో ఉన్న ఒక కిరాణాషాపు వ్యాపారికి సరుకులు తీసుకొని బయలుదేరాడు. అదే ఆటోలో మొలగవళ్లికి చెందిన వెంకటేశ్వర్లు కూడా ఎక్కాడు. ఆటో చాకలికుంట వద్దకు వెళ్లగానే ఆలూరువైపు వస్తున్న గాలిమరల కంపెనీకి చెందిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర​ కొండప్ప తీవ్రంగా గాయపడగా,  వెంకటేశ్వర్లు పక్కనే ఉన్న నీటి గుంతలోకి ఎగిరిపడ్డాడు. ఆ మార్గంలో వస్తున్న ప్రయాణికులు గుంతలో పడిన వెంకటేశ్వర్లను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. వారిద్దరిని ఆలూరు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అపస్మారక స్థితికి చేరుకున్న కొండప్ప కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య జయంతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆలూరు ఎస్‌ఐ ధనుంజయ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన ఆటోను, కారును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా