ఆటోడ్రైవర్‌ నిజాయితీ

29 Sep, 2016 01:15 IST|Sakshi
ఆటోడ్రైవర్‌ నిజాయితీ
 
నెల్లూరు(క్రైమ్‌):
రోడ్డుపై పడి ఉన్న బంగారు ఆభరణాల బ్యాగ్‌ను బాధితునికి అందజేసి ఆటోడ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. గిడ్డంగి వీధికి చెందిన బంగారు వ్యాపారి చంద్రశేఖర్‌ తన కుమారుడ్ని బస్సు ఎక్కించేందుకు ఆత్మకూరు బస్టాండ్‌లో తన నగలబ్యాగ్‌ను బైక్‌పై పెట్టి కుమారుడ్ని బస్సు ఎక్కించాడు. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. నగల బ్యాగ్‌ బస్టాండు సమీపంలో రోడ్డుపై పడిపోయింది. గమనించిన ఆటోడ్రైవర్‌ శివాజినాయక్‌ సదరు వ్యక్తి కోసం చుట్టుపక్కల గాలించాడు. చంద్రశేఖర్‌ బ్యాగ్‌ కనిపించకపోవడంతో రెండో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాగ్‌లో రూ లక్ష విలువచేసే 30గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతలో ఆటోడ్రైవర్‌ బ్యాగ్‌ను తెరచి చూడగా అందులో ఉన్న బాధితుడి ఫోన్‌ నెంబర్‌కు ఫోను చేసి బ్యాగ్‌ తన వద్ద ఉందని చెప్పాడు. అనంతరం బ్యాగ్‌ను రెండో నగర ఇన్‌స్పెక్టర్‌ వి. సుధాకర్‌రెడ్డి సమక్షంలో ఆటోడ్రైవర్‌  శివాజినాయక్‌ నగల బ్యాగ్‌ను బాధితునికి అప్పగించాడు. ఆటోడ్రైవర్‌ నిజాయితీని ఇన్‌స్పెక్టర్‌ అభినందించి ఆటోడ్రైవర్‌ను సత్కరించి రూ. రెండు వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. 
మరిన్ని వార్తలు