అపన్న హస్తం కోసం ఎదురుచూపు..

18 Nov, 2016 03:05 IST|Sakshi
అపన్న హస్తం కోసం ఎదురుచూపు..

ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో..
ఒక్క  క్షణంలో ప్రమాదానికి గురైన నిరుపేద కుటుంబం.. తన కొడుకును కాపాడుకోవడానికి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది
ఖానాపూర్ :మండలంలోని తర్లపాడ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీలోని ఎరుకల వాడకు చెందిన నిరుపేద కుంటుబానికి చెందిన ఏఆర్‌ఎస్ కళాశాల ఇంటర్ విధ్యార్థి లోకిని రాకేష్ తల్లిదండ్రులు అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 15న రాత్రి తర్లపాడ్ నుంచి ఖానాపూర్ వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి తమ కుమారుడి తలకు తీవ్ర గాయాలై ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాతున్నాడని బాధిత విధ్యార్థి తల్లిదండ్రులు లోకిని పెంటన్న, సత్తవ్వలు సాక్షితో వారి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిచినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకె ళ్లామని తెలిపారు. కాగా తమ కుమారుడి వైద్యానికి రూ. లక్షల్లో ఖర్చు అవుతుందని, తాము రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో కూలీచేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని ఇటువంటి క్రమంలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అపన్నహస్తాన్ని అందించాలని వారు వేడుకున్నారు.

విరాళాల సేకరణ...
 ప్రమాదంలో గాయపడ్డ తోటి స్నేహితునికి తమ వంతు సహాయం అదించాలనే ఉద్దేశంతో సుమారు 50 మంది వరకు అతని స్నేహితులు మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలతోపాటు విద్యా సంస్థల్లో విరాళాలు సేకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే సెల్ 9666701055, 8331889391 లేదా ఎస్‌భీహెచ్ ఖాతా నెం. 62103514522 నెంబరల్లో విరాళాలు వేయాలని కోరారు.

>
మరిన్ని వార్తలు