చిత్రలేఖనంలో సత్తాచాటిన పారిశుద్ధ్య కార్మికుడు

13 Dec, 2016 22:41 IST|Sakshi
  •  అవార్డు’ను దక్కించుకున్న రేలంగి నాగేశ్వరరావు
  • అమలాపురం టౌన్‌ :
     స్థానిక మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్న రేలంగి నాగేశ్వరరావుకు ప్రముఖ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఈ ఏడాది కోనసీమ చిత్ర కళా పరిషత్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్ర లేఖన పోటీల్లో నాగేశ్వరరావు కలోజ్‌ ప్రక్రియలో రూపొందించిన దేవాలయం చిత్రానికి ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు పికాసో పేరు మీద చిత్రానంద అవార్డు దక్కింది. నాగేశ్వరరావు కుంచెలు, రంగులతో చిత్రాలు గీయటంలోనే కాదు కలోజ్‌ వర్క్‌తోనూ భావ గర్భిత చిత్రాలు రూపాందించడంలో దిట్ట. ఉదయం పారిశుధ్య పనుల్లో తలమునకలయ్యే నాగేశ్వరరావు రాత్రి సమయాన్ని తనకు ఇష్టమైన చిత్ర లేఖనం కోసం కేటాయిస్తాడు. 2017 జనవరి 22న అమలాపురంలో జరిగే కోనసీమ చిత్ర కళా పరిషత్‌ జాతీయ చిత్ర కళాపోటీల బహుమతి ప్రదానోత్సవ సభలో ఈ అవార్డు అందుకోనున్నట్టు కోనసీమ చిత్ర కళా పరిషత్‌ వ్యవస్థాపకుడు కొరసాల సీతారామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడు నాగేశ్వరరావును మున్సిపల్‌ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, కమిషనర్‌ సీహెచ్‌ శ్రీనివాస్, మున్సిపల్‌ పారిశుధ్య అధికారి తమ్ములపల్లి ప్రకాష్‌ అభినందించారు. 
     
మరిన్ని వార్తలు