కళా సాహితీ సేవలకు ఉత్తమ పురస్కారాలు

11 Oct, 2016 00:22 IST|Sakshi
కర్నూలు (కల్చరల్‌): కర్నూలు జిల్లాలో కళా, సాహిత్యరంగాలో​‍్ల ఉత్తమ సేవలందించిన వారికి ఈనెల 16న ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్‌ ఉత్తమ సేవా పురస్కారాలు అందజేయనున్నదని ఆ సంస్థ కార్యాధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రంగాలలో సేవలందించిన వారు ఈనెల 13వ తేదీ లోపల ఫోటోలతో కూడిన తమ బయోడేటాలను శ్రీరామ థియేటర్‌ పక్కనున్న నైస్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు సెల్‌: 93968 61308 నంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.
 
మరిన్ని వార్తలు