స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలి

12 Dec, 2016 15:19 IST|Sakshi
స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలి
 
సూళ్లూరుపేట: చిరువ్యాపారులు కూడా స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారి సీహెచ్‌ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం వర్తక, వ్యాపార వర్గాల వారికి స్వైపింగ్‌ యంత్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. మరో ఏడెనిమిది నెలల వరకు ఇబ్బందుల ఉంటాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం స్వైపింగ్‌ మిషన్లను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ మిషన్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందని దీనికి ఎవరూ ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.  డీసీటీఓలు గోపీచంద్, వరప్రసాదరావు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధి వాకిచర్ల శాంతారామ్, క్లాత్‌ మర్చంట్‌ అసోసియేన్‌ అధ్యక్షుడు అలవల సూరిబాబు, పాన్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌జైన్, కిరాణా మర్చం అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీ  కృష్ణారావు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు