గజ ఈతగాళ్లకు అవగాహన

7 Aug, 2016 20:25 IST|Sakshi
గజ ఈతగాళ్లకు అవగాహన కల్పిస్తున్న మత్స్యశాఖ ఏడీ
ఆత్మకూర్‌ : కష్ణాపుష్కరాల సందర్భంగా మండల పరిధిలోని జూరాల పుష్కరఘాట్‌ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఏడీ ఖాజా మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత గజ ఈతగాళ్లదే అన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పుష్కరస్నానం ఆచరించే భక్తులకు భరోసా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమకు పుట్టీలు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరగా ఆ పుట్టీలను వారే సమకూర్చుకోవాలన్నారు. ప్రతి మత్స్యకారుడికి రోజుకు రూ.350 గౌరవ వేతనం అందజేస్తామన్నారు. జూరాల పుష్కరఘాట్‌ వద్ద 12మంది గజ ఈతగాళ్లను నియమిస్తున్నామని, అదేవిధంగా జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద 12మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు