6 నుంచి ‘బడి రుణం..తీర్చుకుందాం’

30 Nov, 2016 00:09 IST|Sakshi
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో మంది చదివి నేడు ఉన్నత స్థానాల్లో స్థిర పడి ఉంటారు. అలాంటి వారందరూ తను చదివిన స్కూల్‌ రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాలోని 54 మండల కేంద్రాల్లో పాఠశాల విద్యార్థులతో బడి రుణం తీర్చుకుందాం రండి.. అంటూ ర్యాలీలు నిర్వహించనున్నారు.  మంగళవారం కలెక్టరేట్‌లో ఏజేసీ రామ స్వామి, డిప్యూటీ ఈఓ తహెరాసుల్తానా, సర్వశిక్ష అభియాన్‌ సీఎంఓ జయ రామకృష్ణారెడ్డిలు ర్యాలీల పోస్టర్లను ఆవిష్కరించారు. మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌ఏ అధికారులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
 
సహాయం చేస్తే...నోటిస్‌ బోర్డులలో దాతల పేర్లు 
స్కూల్‌ అబివృద్ధి కోసం 10 నుంచి 20 లక్షల రూపాయలను సహయం చేసే వారి పేర్లను నోటీస్‌ బోర్డులలో చిరకాలం ఉండిపోయేలా రాస్తారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఒక పుస్తకంలో పక్కాగా లెక్కలు రాస్తారు. దాతల పేర్లు, ఫోటోలు ఠీఠీఠీ.టట్చ్చp.జౌఠి.జీn అనే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
               
 
మరిన్ని వార్తలు