ముగిసిన బ్యాడ్మింటన్‌ పోటీలు

23 Sep, 2016 00:40 IST|Sakshi
భీమవరం టౌన్‌ :  స్థానిక డీఎన్నార్‌ కళాశాల ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన జేఎ¯Œæటీయూకే అంతర కళాశాలల బ్యాడ్మింటన్‌ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో పి.సుమంత్‌(వీఆర్‌ఎస్‌ వైఎన్నార్‌ కళాశాల, ఒంగోలు), జీవీ సురేంద్ర (కైట్, కోరంగి), పి.రాహుల్‌ కిశోర్‌ (వీఈడీ, విజయనగరం), డి.అనిల్‌కుమార్‌ (డీఎన్నార్, భీమవరం), బీహెచ్‌ వీఎస్‌ఎస్‌ఎన్‌ ప్రవీణ్‌(పొట్టి శ్రీరాములు, విజయవాడ) ఎస్‌కే కార్తిముల్‌్బ(కైట్, కోరంగి), జి.అనిల్‌ కుమార్‌ (సెయింట్‌ ఆన్స్, చీరాల) గెలుపొందినట్టు నిర్వాహకులు ప్రకటించారు. టోర్నమెంట్‌కు జెఎన్‌టీయూకే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డి.శ్యామ్‌కుమార్‌ నాని ప్రసాద్‌(విజయవాడ), చంద్రశేఖర్‌ (వైజాగ్‌) సెలక్షన్‌ కమిటీ మెంబర్లుగా వ్యవహరించారు. విజేతలను డీఎన్నార్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, సభ్యులు అభినందించారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు