కేజీబీవీల్లోకి బాలసదనం విద్యార్థులు

21 Jun, 2017 22:56 IST|Sakshi

అనంతపురం టౌన్‌ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనాల్లోని విద్యార్థులను కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో చేర్పించాలని ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ ఉషాఫణికర్‌ సూచించారు.  అనంతపురం, ధర్మవరం, హిందూపురంలోని బాలసదనం సూపరింటెండెంట్లు రాధిక, సరస్వతి, రహమత్‌బీతో బుధవారం  ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను వివరించారు.

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను సమీపంలోని కేజీబీవీల్లోచేర్పించాలన్నారు.   1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను పూర్తి స్థాయిలో చేర్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించాలన్నారు. బాలసదనాల్లో అందించే సేవలను జేయాలన్నారు. అనాథలు, అవ్వతాత ఉండి ఆలనాపాలనా చూసుకోవడం ఇబ్బందిగా ఉన్న పిల్లలను గుర్తించాలన్నారు.  జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు