బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

29 Oct, 2016 02:09 IST|Sakshi
చాగల్లు : అండర్‌–14 స్కూల్‌గేమ్స్‌ జిల్లా స్థాయి బాల, బాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలను చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా వ్యాయామ ఉపా«ధ్యాయుల సంఘం అధ్యక్షుడు మరడాని అచ్యుత్, స్కూల్‌గేమ్స్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాయి శ్రీనివాస్‌ ముఖ్య అతి«థులుగా హాజరై పర్యవేక్షించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు నవంబర్‌ నెలలో పెంటపాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.అనిల్‌కుమార్, వట్టికూటి సత్యనారాయణ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
∙బాలుర విభాగం జట్టు 
జి.కరుణ్య, యు.నితిన్, ఎం.రోహిణీకుమార్‌ (చాగల్లు), బి.రాహుల్‌(గౌరీపట్నం), యు.నరేష్‌ (బ్రాహ్మణగూడెం), కె.వెంకట రమణ (మద్దూరు), ఎస్‌.భార్గవ (పెంటపాడు), ఎం.సతీష్‌ (సమిశ్రగూడెం)
∙బాలికల విభాగం 
సీహెచ్‌ శ్రీజ, బి.స్వాతి (చాగల్లు), కె.శ్యామ్, ఎస్‌.పూజిత, ఎస్‌కే షలాంబి (పెంటపాడు), కె.జ్యోతి (శెట్టిపేట), ఎం.హిమవతి (తాళ్లపూడి), జె.జయరేఖ(ఊనగట్ల) ఎంపికయ్యారు.
 
మరిన్ని వార్తలు