2003డీఎస్సీ టీచర్లకు పాతపెన్షన్‌ వర్తింపజేయాలి

26 Jul, 2016 23:42 IST|Sakshi
 
వీణవంక : 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్‌ విధానాన్ని వర్తింపజేసి సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు నందికొండ విద్యాసాగర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన యూనియన్‌ సమవేశంలో ఆయన మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కరించి పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయాలని, పండిత, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల శాఖ అ«ధ్యక్షుడు బాలాజీ, శేషాద్రి, కుమార్, రాజయ్య, బాల్‌రాజ్, అశోక్, శ్రీనివాస్, నాగిరెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ల
 
 
మరిన్ని వార్తలు