సిద్దిపేట వద్దు..కరీంనగర్‌ ముద్దు

20 Aug, 2016 18:13 IST|Sakshi
సిద్దిపేట వద్దు..కరీంనగర్‌ ముద్దు
 • కోహెడలో అఖిలపక్షం బంద్‌ సంపూర్ణం
 • కోహెడ : కోహెడ మండలాన్ని కరీంనగర్‌ జిల్లాలో కొనసాగించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కోహెడ బంద్‌ సంపూర్ణమైంది. మండల కేంద్రంలో కిరాణం దుకాణాల వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను అఖిలపక్షం నాయకులు బహిష్కరించారు. ప్యాసెంజర్, ట్రాలీ ఆటో యజమానులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. అంబేద్కర్‌చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అఖిలపక్షం నాయకులు కర్ర రవీందర్, ఖమ్మం వెంకటేశం, సంది శ్రీనివాస్‌రెడ్డి, బందెల బాలకిషన్, కోటేశ్వరాచారి, గవ్వ వంశీధర్‌రెడ్డి, అన్నబోయిన కనకయ్య, వలుస సుభాష్, గాజుల వెంకటేశ్వర్లు, మ్యాకల బాలకిషన్‌రెడ్డి, శెట్టి సుధాకర్, బస్వారాజు శంకర్, ఇట్టిరెడ్డి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
   
   
   
   
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు