బంజారాల ప్రగతికి కృషి

27 Jun, 2016 08:44 IST|Sakshi
బంజారాల ప్రగతికి కృషి

గిరిజనతండాల్లో ఇంటింటికీ తాగునీరు
ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్
పంచాయతీలుగా గిరిజన తండాలు: జూపల్లి
 

షాద్‌నగర్: బంజారాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈడెన్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన బంజారా భేరి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బంజారాలు పోషించిన పాత్ర ఎంతో కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కోరినవి, కోరని ఎన్నో హామీలను అమలు చేస్తుందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతుందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఒకే సంవత్సరం 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.


పేదలకు ఉచితవైద్యం...
రాష్ట్రంలోని పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొం దిస్తుందని మంత్రి ఈటల ఈ సందర్భంగా తెలపా రు. ప్రమాదవశా త్తు కా ర్మికులు మరణిస్తే వారికి రూ. 6 లక్షల బీ మాను అందచేస్తుందన్నారు. బం జారా పూజారులకు జీతాలు అందచేయాలని నా యకులు కోరారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇ ప్పటి వరకు ప్రభుత్వం 206 జీఓలు విడుదల చేస్తే అందులో 100పైగా జీఓ లు పేదవారి సంక్షేమం కోసం విడుదల చేసినవేనన్నారు.


ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట: మంత్రి జూపల్లి
ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే యోచనతో రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామన్నారు.

రిజర్వేషన్‌శాతం పెంచాలి: ఎమ్మెల్సీ రాములునాయక్
అనంతరం ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్‌ను పెంచాలని కోరారు. గిరిజన తండాల్లో ఉన్న దేవాలయాలకు దూప దీప నైవేద్యాలు లేవన్నారు. సబ్‌ప్లాన్ సక్రమంగా అమలు కావాలంటే తండాల్లో డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ గిరిజనులు శ్రమజీవులు, వారికి కేటాయించిన పథకాలను సద్వినియోగం చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీస్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టూనాయక్, జిల్లా కన్వీనర్ రాంబాల్‌నాయక్, మంగులాల్‌నాయక్, వీర్లపల్లి శంకర్, జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ, ఎంపీపీ బుజ్జి, అందెబాబయ్య, కందివనం సూర్యప్రకాష్, వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు