హోరాహోరీగా బాస్కెట్‌బాల్‌ పోటీలు

18 Oct, 2016 23:22 IST|Sakshi
హోరాహోరీగా బాస్కెట్‌బాల్‌ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్‌: డీఎస్‌ఆర్‌ ఫ్రెండ్స్‌ క్లబ్ ఆధ్వర్యంలో స్దానిక బ్రహ్మనందరెడ్డి స్డేడియంలో జరుగుతున్న 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్‌ బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో డీఎస్‌ఆర్‌ ఫ్రెండ్స్‌ క్లబ్, జీఎస్‌సీ గుంటూరు, యాదవ హైస్కూల్, వి.వి.ఐ.టి, నంబూరు, ఏఎన్‌యూ, పొలీస్‌ పెరేడ్‌ జట్టు, జె.కె.సి కళాశాల, ఏసీ కళాశాల జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాయి. మహిళాల విభాగంలో ఏఎన్‌యూ జట్టు, జీఎస్‌సీ గుంటూరు, నర్సరావుపేట మున్సిపల్‌ హైస్కూల్, ఎన్టీఆర్‌ స్టేడియం జట్లు సూపర్‌ లీగ్‌ దశకు చేరుకున్నాయి. బుధవారం పురుషుల, మహిళ విభాగాలలో సెమి ఫైనల్స్, ఫైనల్స్‌ మ్యాచులు జరుగుతాయని డీఎస్‌ఆర్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి టీ.గురునాధం తెలిపారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు.
మరిన్ని వార్తలు